ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 11:30 AM

ఈరోజు పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారం డివిజన్ ప్రాంతంలో మాజీ జడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి గారు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి గారు, బీఆర్‌ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ కే చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిందని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.అనంతరం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కే చంద్రశేఖర్ రావు గారి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసినట్టు తెలిపారు.నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, ప్రజల సంక్షేమమే పార్టీ లక్ష్యమని అన్నారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని, కే చంద్రశేఖర్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శెంబిపూర్ రాజు గారు, మెట్టు కుమార్ యాదవ్ గారు, తొంట అంజయ్య గారు, గడిల శ్రీకాంత్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు వెంకటేష్ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, జనార్దన్ గారు, రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa