TG: హైదరాబాద్ మియాపూర్‌లో లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడింది. కూకట్‌పల్లి నుండి గడ్డపోతారం వెళ్తుండగా, బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద బస్సు నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని పది మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa