సంగారెడ్డి జిల్లా కంగ్జి మండలంలోని రసూల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ వసంత కుమారిని, ఆమె భర్త అప్పులు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ గ్రామస్తులు చెట్టుకు కట్టేసి బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7న జరిగిన ఈ ఘటనలో, సాయవ్వ, చాకలి బాలవ్వ, వైద్యనాథ్ తదితరులు వసంత కుమారిని డబ్బులు ఇవ్వకపోతే ఊరేగిస్తామని బెదిరించారు. భూమి అమ్మి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ఆమెను వదిలిపెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa