శ్రావణ మాసం శనివారం అమావాస్య తిధి కావటంతో రాజాం నియోజకవర్గం లోని వంగర సంతకవిటి రేగిడి ఆమదాలవలస రాజాం మండలం మరియు పట్టణంలో గల వివిధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష మైన పూజలను ఆయా దేవాలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అర్చన అష్టోత్తరాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి శనివారం వేకువ జాము నుంచే భక్తులు స్వామివారి ఆలయాలలో బారులుతీరారు. భక్తులు స్వామివారికి తులసిమాలలతో పుష్పమాల లను సమర్పించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.