గూగుల్ లో కావాల్సిన అంశాలను వెతికేందుకు వందకు పైగా భారతీయ భాషల్లో సెర్చ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. టెక్స్ట్ తో పాటు వాయిస్ ద్వారా సెర్చ్ చేసేలా వీలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే 1000 భాషలను ఆన్ లైన్ లోకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు తమ భాషలో సమాచారం అందించడమే తమ ఉద్దేశమని పిచాయ్ తెలిపారు.