ప్రస్తుత కాలంలో అవసరాలకు అనుగుణంగా ఏదో ఓ ఆవిష్కరణ వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు మల మూత్రాలతో విద్యుదుత్పత్తి చేసే విధానానికి నాంది పలికారు. ఈ క్రమంలో వారి ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయట. ‘మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్’ అనే ఎనర్జీ కన్వర్టర్ ద్వారా ఇది సాధ్యమని సైంటిస్టులు వివరిస్తున్నారు. దీంతో మొబైల్, ల్యాప్ టాప్ ఛార్జింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇది పూర్తిగా సక్సెస్ అయితే మన ‘వేస్ట్’ నుంచే విద్యుత్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు.