రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే 12 విడతలను ప్రభుత్వం విడుదల చేయగా.. 13వ విడత పెట్టుబడి సాయం హోళీ సమయానికి అందుతుందని అందరూ భావించారు. అయితే పలు మీడియా సంస్థలు అందించిన సమాచారం మేరకు 13వ విడత ఫిబ్రవరి 24న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా అదే రోజు రైతు భరోసా డబ్బులను అందించనుంది. అంటే రైతులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు.