హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఓ వ్యక్తి స్కూటీ ఫ్యాన్సీ నెంబరు ‘HP-99-9999’ కోసం వేలంలో ఏకంగా రూ.1.12 కోట్లకు పైగా బిడ్డింగ్ వేసిన విషయం గురువారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వేలంలో మొత్తం 26 మంది పాల్గొనగా శుక్రవారం సాయంత్రం ఆన్ లైన్ బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఈ వీఐపీ నెంబర్ రూ.కోటికి పైగా అమ్ముడుపోయింది. అయితే, వేలం వేసిన వ్యక్తి దేశరాజ్ ఎక్కడ నివసిస్తున్నాడో సమాచారం లేని క్రమంలో గందరగోళం నెలకొంది. ఇది ఆన్ లైన్ మోసం కూడా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇప్పుడు దేశరాజ్ 3 రోజుల్లో 30 శాతం డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంది.