యూకేలో మెడిసిన్ కోర్సు చేయాలంటే ఇంటర్ లో బైపీసీలో మంచి మార్కులు సాధించి ఉండాలి. ఐఈఎల్టీఎస్ పరీక్షలో కనీసం 7 స్కోర్ చేయాలి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ సెక్షన్లలో కనీసం 6.5 స్కోర్ సాధించాలి. లేదా ఇంటర్నేషనల్ బ్యాకలోరియట్ (ఐబీ) పరీక్షలో కనీసం 40 స్కోర్ చేయాలి. కొన్ని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం యూకే క్లినికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో పాసవ్వడం తప్పనిసరి. ఈ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు.