కడప: ఈనెల 25న తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన టిడిపి రాయలసీమ జోన్ సమావేశంలో భాగంగా కడప ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ స్థాయిలో ప్రాంగణాన్ని సంసిద్ధం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం డిఎస్పి వెంకట శివారెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, ఎస్సై శ్రీనివాసరెడ్డిలు ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. రాయలసీమలోని 38 నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జులు, మండల స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున దాదాపు పది వేలకు మంది పైగా ఈ సభకు హాజరవుతారని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. డిఎస్పి సూచనల మేరకు సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు చంద్రబాబు కాన్వాయ్ లోనికి వచ్చి, వెళ్ళే మార్గాలను కట్టుదిట్టంగా ఉండేవిధంగా కొన్ని మార్పులు చేశారు. ప్రాంగణ ఏర్పాట్లను సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.