ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సతీమణి వైస్ భారతి రాజకీయాల్లోకి వస్తున్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కు కంచుకోట సొంత జిల్లా కడప. అయితే ఈసారి ప్రజా వ్యతిరేకత కారణంగా ఇబ్బందులు తప్పవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందుకే బలమైన అభ్యర్థులు బరిలో ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతిని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బరిలో దించుతారని సమాచారం.