ప్రేమజంటను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిద్దామని ప్రయత్నించిన ఘటన యూపీలోని మీరట్లో చోటుచేసుకుంది. పెప్లాకి చెందిన సాక్షి, దేవేంద్ర ప్రేమించుకున్నారు. ఈక్రమంలో యువకుడు యువతి ఇంటికి వెళ్లగా, వారిద్దరినీ ఆమె తండ్రి ఏకాంతంగా చూశాడు. కోపంతో వెంటనే తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరపటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, వీరిద్దరూ వరసకి అన్నాచెల్లెళ్లు అవుతారని సమాచారం.