వేసవి ఎండలను తట్టుకోవాలంటే ఏసీ ఉండాల్సిందే! కానీ కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గది సామర్థ్యం బట్టి ఏసీ ఎంచుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీని కొనుగోలు చేయడమే మేలు. కనీసం 3 స్టార్ ఆపైన రేటింగ్ ఉన్నవి తీసుకోవడం బెటర్. ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీ తీసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. పలు ఏసీల్లో ఆటో క్లీన్ మోడ్ ఉంటుంది. దానివల్ల తరచూ శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది.