టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ఏడాది మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భారతీ ఎయిర్టెల్ సీఈఓ సునీల్ భారతీ మిత్తల్ తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్నందున టారిఫ్ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీ ఎయిర్టెల్ గత నెలలో కనీస రీఛార్జ్ ధరను 57% పెంచగా.. త్వరలోనే టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది.