ఇండోర్ టెస్టులో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. స్కోర్లు భారత్ 109 & 163, ఆసీస్ 197&78-1. 4 టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో భారత్ ముందంజలో ఉంది. ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ స్పిన్ ముందు రెండు రోజుల్లోనే చాప చుట్టేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 34 ఓవర్లలోనే 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లు తబబడ్డ పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడారు. దాంతో మొదటి ఇన్నింగ్స్ లో 88 పరుగుల లీడ్ తో 197 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో రోజు మొదటి సెషన్ లోనే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ అందొచ్చిన అవకాశాన్ని జార విడిచింది. నాథన్ లియాన్ స్పిన్ మాయా జాలానికి టీమిండియా బ్యాటర్లు నిలవలేక పోయారు. కేవలం 61 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ నిర్ధేశించిన 75 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సింపుల్ గా చేదించింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచుల సిరీస్ ను 2-1తో సిరీస్ రేసులో నిలిచింది.