సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హోండా సంస్థ తన కొత్త హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ విడుదల చేసింది. రూ.11.49 లక్షల నుంచి రూ.20.39 లక్షల మధ్య దీని ధరను నిర్ణయించారు. ఈ కారు ఎస్ వీ, వీ, వీఎక్స్, జెడ్ ఎక్స్ అనే 4 ట్రిమ్స్ ల్లో అమ్మకానికి అందుబాటులో ఉంచింది. కొత్త మోడల్ లో 1.5 లీటర్ ఎన్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 118 బీహెచ్ పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది దాదాపు లీటరుకు 18 కి.మీ మైలేజీ ఇస్తుంది.