వాట్సాప్ త్వరలో 'ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్' అనే కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ తో యూజర్లు తాత్కాలిక గ్రూప్ లను క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ అడ్మిన్ సెట్ చేసిన డేట్, టైం వచ్చిన తర్వాత ఆ గ్రూపులు ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ సాధారణ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ తో పాటు మరికొన్ని ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.