జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి ఉద్యోగంలో అవస్థలు, కర్కాటక రాశి వారికి పని భారం, నిందలు ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. అలాగే, తులా రాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలంటున్నారు. మకర రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుందని, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు.