జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారిని మూడో అంకె జాతకులు అంటారు. వీరు ఆరోగ్యంతో ఉండి అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. స్వతంత్ర జీవనాన్ని ఇష్టపడతారని, విద్యలోనూ, పలు కళల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉంటారని పేర్కొంటున్నారు. అయితే, వీరికి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు బాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.