కియా కంపెనీ కారెన్స్ 2.0 పేరుతో కారును మన దేశంలో కొత్తగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.10.44 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా ఇంజిన్, గేర్ బాక్స్ వంటివి అప్ గ్రేడ్ చేసింది. ఈ మోడల్ మొత్తం 5 ఆప్షన్లలో ప్రీమియం, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ లో అందుబాటులో ఉంది. వీటి ధర రూ.17.49 లక్షలుగా ఉంది. ఈ కారును 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, అత్యాధునిక ఫీచర్లతో తీసుకొచ్చారు.