మేషం
పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.
వృషభం
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కర్కాటకం
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.
సింహం
వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు.
కన్య
కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
తుల
మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. పాత రుణాలు కొన్ని తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత ఆశ్చర్య పరుస్తాయి. చాలాకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ధనస్సు
సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి.
మకరం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు.
కుంభం
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.
మీనం
కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.