తవణంపల్లి మండలం , అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. కానుకల ద్వారా రూ. 12, 18, 724లు ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పైమాఘం సురేంద్రరెడ్డి, ఈఓ వెంకటసుబ్బారెడ్డి తెలి పారు. దేవదాయశాఖ అధికారి కె. కమలాకర్, పంచాయతీ కార్యదర్శి కె. మహేష్, మహిళా పోలీస్ ఎం. ఎన్. గౌరి, సప్తగిరి గ్రామీణ బ్యాం మేనేజర్ శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.