నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరం జాతర బుధవారం నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు భక్తులకు అడవిలోకి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నల్లమలలో చెంచులే పూజారులుగా జరిపే సలేశ్వరం ఉత్సవాలు బుధవారం ప్రారంభంకానున్నాయి.