ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. భారత్ లో ఇది కనిపించకపోయినప్పటికీ కొన్ని రాశులకు గ్రహణ ప్రభావంతో మహర్దశ పట్టనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సింహ రాశి వారికి పనుల్లో విజయం, శుభ సమయం, మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానం, కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొంటున్నారు.