జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురు, రాహు గ్రహాల కలయిక ఏప్రిల్ 23 నుంచి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ధనుస్సు రాశి వారికి తెలియని భయం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కన్యా రాశి వారికి కుటుంబంలో విభేదాలు, మిథున రాశి వారికి వ్యాపారంలో తీవ్ర నష్టాలు కలిగే అవకాశం ఉంది. మేష రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.