జ్యోతిష్యం ప్రకారం జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులను బట్టి ఫలితాల్లో మార్పులుంటాయని పండితులు చెబుతున్నారు. మేష, సింహం, తుల, ధనుస్సు రాశుల వారికి భవిష్యత్తు గురించి ఆలోచన తక్కువ ఉంటుందని ఆర్థిక వ్యవహారాల్లో సరైన ప్రణాళిక ఉండదంటున్నారు. డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తారని చెబుతున్నారు. మేష, తుల రాశి వారు ఇందులో ఓ అడుగు ముందుగానే ఉంటారని పేర్కొంటున్నారు. విలాసాలు విపరీతంగా పెరుగుతాయంటున్నారు.