తలస్నానం చేసిన కొద్దిరోజులకు కొంతమందికి జుట్టు జిడ్డుగా మారుతుంది. అలాంటి వారు వారానికి 2-3 సార్లు తప్పక తలస్నానం చేయాలి. నూనె ఆధారిత షాంపూ, కండిషనర్ కి దూరంగా ఉండాలి. కండిషనర్ ని కురులకే పరిమితం చేయండి. హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటనింగ్ కి దూరంగా ఉంటే మంచిది. దువ్వెనలు, హెయిర్ బ్రష్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. సహజ పదార్థాలతో చేసిన షాంపూలు లేదా కుంకుడు, శీకాకాయ వంటి వాటిని వాడాలి.