ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి తగినంత నిద్ర ముఖ్యం. సగటున కనీసం 7-8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. కానీ కొందరు ఎప్పుడూ నిద్ర మత్తులోనే ఉంటారు. అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోతారు. నిజానికి ఆరోగ్యపరంగా ఇది చాలా హానీకరం. ఇలా పగటి వేళ ఎక్కువగా నిద్రపోవడాన్నిహైపర్సోమ్నియా అంటారు.హైపర్సోమ్నియా సమస్యతో బాధపడే వ్యక్తి అన్ని వేళల్లో నిద్రపోతూనే ఉంటారట. వీళ్లు అసలు నిద్ర లేకుండా జీవించలేరు.వారికి ప్రతిరోజూ కూడా ఇలాగే ఉంటుంది. వారి రోజువారి పనులను పూర్తి చేయడం వీరికి పెద్ద సవాల్‌గా ఉంటుంది.ఇక నిద్రలేమి సమస్యకు, హైపర్సోమ్నియాకు చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.