బెండకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే, దీన్ని కొంతమంది తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొలలు, మూత్రపిండ వ్యాధులు, కీళ్లనొప్పులు ఉన్న వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదంటున్నారు. గర్భిణీలు బెండకాయ తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. బెండ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పని చేస్తుందని చెబుతున్నారు.