మహిళల ఆరోగ్యం కోసం కొన్ని ఫుడ్ టిప్స్ పాటించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పాలు, చేపలు, గుడ్లు, సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు, నట్స్, పాలకూర, యాపిల్, బొప్పాయి తీసుకోవాలి. నిమ్మరసం, సలాడ్ తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు నానబెట్టిన బాదం తినాలి. రోజువారీ భోజనంలో మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచిస్తున్నారు.