చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. కానీ, వీటిని అతిగా తింటే దుష్ప్రభావాలేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చాక్లెట్ లోని అధిక చక్కెర పేగులో హానికర బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు. ఇందులోని కెఫిన్ కొంత మేలు చేసినా అధిక మోతాదులో తీసుకుంటే గుండె దడ, నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు.