ముందుగా 6 మందార పువ్వుల్ని మెత్తని గుజ్జుగా చేయాలి. అందులో 4 చెంచాల కొబ్బరినూనె, చెంచా ఉసిరి పొడి కలిపి తలకు మర్దన చేయాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ఏ, బీ, సీ విటమిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజ లవణాలు, అమీనో యాసిడ్స్, ప్రొటీన్లు ఉండే ఈ లేపనంతో జుట్టు ఆరోగ్యవంతమవుతుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు రాలకుండా చేస్తుంది.