భక్తుల రద్దీ పెరుగుతుండడంతో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు స్వామివారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశాం. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తాం.. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించం.' అని టీటీడీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.