సాధారణంగా అమావాస్య రోజు కొన్ని తప్పుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. కొత్త దుస్తులు ధరించకూడదు. ఆ రోజు మధ్యాహ్నం నిద్రించకూడదు. తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే శుభ ఫలితాలు. తలకు నూనె పెట్టకూడదు. గడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం వంటివి చెయ్యొద్దు. ఆ రోజు పసి పిల్లలను సాయంత్రం బయటకు తీసుకెళ్లకూడదంటున్నారు.