వేసవిలో ప్రతిరోజు పోషకాలు కలిగిన పండ్లు తినడం వల్ల సులభంగా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. వేసవిలో ప్రతిరోజు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి చెర్రీలను తీసుకోవాలి. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు నిమ్మ, బత్తాయి, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.