అనకాపల్లి జిల్లా కంశింకోట మండలం వెదురుపర్తి తేగడ గ్రామ సమీపంలోని సోమవారం శారదా నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతయిన వారు ఎలమంచిలి మండలం పోతిరెడ్డి పాలెం కు చెందిన పిల్లి అనిల్ (14), నక్కపల్లి మండలం చందనాడ కు చెందిన ఎడ్డేడ ప్రసాద్ గ పోలీసులు గుర్తించారు. గాలింపు చర్యల్లో స్థానికులతో పాటు ప్రత్యేక బృందాలు కూడా పాల్గొన్నాయి.