పిల్లలు ఎత్తు పెరగాలంటే వారికి ఎత్తు పెరగడానికి అవసరమైన పోషకాహారాలను అందించాలి. క్యారెట్, బీన్స్, బెండకాయ, బచ్చలికూర, బఠానీలు, అరటిపండు, సోయాబీన్, పాలను పిల్లలకు ఇచ్చే ఆహారంలో భాగం చేయాలి. తరుచూ ఇలాంటి ఆహరం తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. క్యారెట్ లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు ఉంటాయి. బీన్స్ లో ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బెండకాయలో విటమిన్లు, ఫైబర్, పిండి పదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.
బఠానీలలో ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్ లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల కూడా ఎత్తు పెరుగవచ్చు. పాలల్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది. ఉసిరికాయ, గుమ్మడికాయ, ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం కూడా ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.