ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దగ్గు, గొంతు నొప్పిని పోగొట్టుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 14, 2023, 12:09 PM

ప్రతి సీజన్‌లో ఆరోగ్య సంబంధిత సమస్యలు అధికంగా వస్తాయి. ఇందులో గొంతు నొప్పి, దగ్గు, ఇతర అలర్జీల ప్రభావం ఎక్కువ. అలాగే పెరుగుతున్న కాలుష్యం కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం. ఈ పరిస్థితిలో కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించడం ద్వారా వీటి బారి నుంచి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.




  • దగ్గు, గొంతు నొప్పి పోవాలంటే తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తాగాలి.

  • గొంతు నొప్పి పోవాలంటే అల్లంలో ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మింగాలి.

  • చిటికెడు నీళ్లలో పసుపు వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి 10 సార్లు పట్టాలి.

  • పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి నిద్రపోయే ముందు తాగితే ఉపశమనం కలుగుతుంది.

  • జలుబు లేకున్నా రాత్రి పొడి దగ్గు వస్తే ఉప్పు నీళ్లు పుక్కిలించాలి.

  •  గోరు వెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com