మనం చేసే చిన్న చిన్న తప్పులే మన కంటికి ప్రమాదంగా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది కళ్లను గోరువెచ్చని నీళ్లతో కడుగుతారు. అలా చేయకూడదని, చల్లని నీటితో లేదా సాధారణ నీటితో కడగాలని సూచిస్తున్నారు. తరచుగా రెప్ప వేయాలని దీని వల్ల కంటికి ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. కళ్లు పదే పదే రుద్దడం, నిద్ర పోయే ముందు కంటి మాస్కులు పెట్టుకోవడం వంటివి చెయ్యొద్దంటున్నారు.