యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్లుగా ఉన్న వొడాఫోన్, త్రీ సంస్థలు విలీనం కాబోతున్నాయి. 5జీ వైర్‌లెస్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ వ్యాపారాలను విలీనం చేయబోతున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. హాంకాంగ్‌కు చెందిన సీకే హచ్‌సన్ యాజమాన్యంలోని త్రీ సంస్థ.. వొడాఫోన్ యూకేతో విలీనం తర్వాత దేశంలోనే అత్యంత పెద్దదైన మొబైల్ సంస్థగా ఆవిర్భవించనుంది. కొత్త సంస్థ మార్కెట్ విలువ 15 బిలియన్ పౌండ్లు (రూ.1,53,750 కోట్లు) ఉంటుందని అంచనా. వొడాఫోన్‌కు 51 శాతం, త్రీకి మిగిలిన శాతం వాటా కేటాయించారు.