బిపోర్‌జాయ్ తుపాను నేడు తీరం దాటనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో గజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారే పరిస్థితి ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని పేర్కింది. ఈ తుపాను సౌరాష్ట్ర - కచ్ దగ్గర, పాకిస్థాన్‌ను ఆనుకొని ఉన్న తీరప్రాంతం దగ్గర, మాండ్వీ - కరాచీ తీరాల మధ్య జకావూ పోర్టుకి దగ్గర్లో గురువారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa