ఆంధ్రప్రదేశ్ ఇంజినీరంగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్)-2023 ఫలితాల్లో అబ్బాయిలదే హవా కొనసాగింది. ఇంజినీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులు, అగ్రికల్చర్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకుల్లో 8 మంది అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో చల్లా ఉమేష్ వరుణ్, అగ్రికల్చర్ విభాగంలో సత్యరాజ్ జశ్వంత్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీతో ర్యాంకులు ప్రకటించారు. జూలై 15 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.