ప్రస్తుతం ప్రజల జీవనవిధానం మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టైంకి తిని.. టైంకి నిద్రపోలేకపోతున్నాం. రాత్రుళ్లు నిద్ర పోకపోవడం వల్ల ఉదయం లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంటుంది. శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీరు ఉదయాన్నే నిద్ర లేవగలరు. మీ బద్ధకాన్ని వదిలించుకోగలరు.
- ఉదయాన్నే నిద్రలేచేలా సెల్‌ఫోన్‌లో అలారం పెట్టుకోవాలి. అలారం సౌండ్ వినిపించేంత దూరంలో ఉంచాలి. కానీ అక్కడికి మీ చేతులు చేరుకోకుండా చూసుకోవాలి.
- నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు కూడా తగ్గవచ్చు.
- ఫ్రెష్‌అప్ అయిన తర్వాత వ్యాయామం చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు నడవాలి. అప్పుడు రోజంతా చురుగ్గా ఉంటారు.