స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ.10 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్లు ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. జూన్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.