చాలా మంది పిల్లలకు నిద్ర లేవగానే ఆకలేస్తుంటుంది. అప్పుడు తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలకు అల్పాహారం అందజేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీ, దోశ, కిచిడీ వంటివి వండి పెట్టాలి. లైట్ ఫుడ్ ఉండాలి. ఆయిల్‌తో చేసిన పూరీ, వడ, దోశ వంటివి తినిపించకూడదు. పప్పు దినుసులు, కూరగాయాలతో భోజనం ఇవ్వాలి. అలాగే పండ్లు తినిపించాలి. దాంతో పిల్లల్లో శారీరక ఎదుగుదల కనిపిస్తుంది. జంక్ ఫుడ్, చిప్స్, కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.