చెడు అలవాట్లు వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మనం ఏ పని చేసినా తొందరగా అలసిపోతాము. బాడీ పెయిన్స్‌తో ఇబ్బంది పడతాము. దానికి కారణం ఎముకలు బలహీనపడటమే.. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం తప్పులు చేస్తున్నారో తెలుసుకోవాలి. ప్రతి రోజు నడక, యోగా చేయాలి. లేదంటే ఎముకలు బలహీనపడతాయి. ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలి. ఉప్పు, పులుపు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎముకలను బలహీన పరిచే గుణం ఉంటుంది. సమయానికి నిద్రపోవాలి. ధూమపానం, మద్యపానం అలవాటును వదిలేయాలి. కాల్షియం ఎక్కువగా దొరికే ఆహారాన్ని తీసుకోవాలి.