నిమ్మకాయ తొక్కలతో అనేక లాభాలు ఉన్నాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ పొడిలో 2 కేలరీలు, 1 గ్రాము కార్బొహైడ్రేట్స్, 1 గ్రాము ఫైబర్, 9 శాతం విటమిన్ సీ ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. డీ లైమొనెడ్ అనే పదార్థం వల్ల గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ సమస్యను తగ్గిస్తుంది. అధిక బరువు సమస్యను, బీపీని కంట్రోల్ చేస్తుంది. నిమ్మ తొక్కల్లో ఉండే పెక్టిన్ వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో తెల్లరక్త కణాల సంఖ్యను పెరిగేలా చేస్తుంది.