పొద్దున్నే ఖాళీ కడుపుతో చాయ్ తాగడం హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలోని కెఫిన్ వల్ల ఎసిడిటి లాంటి సమస్యలు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖాళీ కడుపుతో చాయ్ తాగడం వల్ల మూత్ర విసర్జన అధికమవుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ మొదలవుతుంది. శరీరంలోని ఐరన్, కాల్షియంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. అలాగే పళ్లపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో కాకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసిన టీ తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.