వేడి చేసిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుతం శీతాకాలంలో అదీ మరీ ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతారు. కానీ అప్పటికే బాగా మరిగించిన నీటిని చల్లార్చి.. మళ్లీ మరిగించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే ప్రయోజనకరమైన నైట్రేట్లు హానికరమైన టాక్సిన్ గా మారి క్యాన్సర్, లుకేమియా, లింఫోమా వంటి వ్యాధులకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. కావున నీటిని ఒకేసారి వేడి చేసుకుని తాగాలని సూచిస్తున్నారు.