రాత్రి పూట కొన్ని ఆహారాలు, పానీయాలు నిద్రను దూరం చేస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే ఆహారంపై జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా మూడు ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం.. రాత్రిపూట కెఫిన్ ఉండే పానియాలు తీసుకోరాదు. కాఫీ, టీ, చాక్లెట్, పెయిన్ కిల్లర్స్, వివిధ శీతల పానీయాలలో కెఫిన్ ఉంటుంది. అలాగే టమాటా, ఉల్లిపాయలు కూడా తినకూడదు. టమాటా వల్ల జీర్ణక్రియ సమస్యలను పెంచే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయలు కడుపులో గ్యాస్‌ను తయారు చేస్తుంది. దాంతో కడుపు ఉబ్బరంగా మారుతుంది. వీలైనంత వరకు వీటిని తినకుండా ఉంటే మంచిది.